ఏపీలో ఫ్లాష్‌ఫ్లడ్స్ అలర్ట్..
ఏపీలో కొన్ని జిల్లాలలో ఫ్లాష్‌ఫ్లడ్స్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుండగా, దీని ప్రభావంతో రానున్న కొన్ని గంటలలో తీవ్ర తుఫానుగా మారుతుందని నాలుగు జిల్లాలలో రెడ్ అలర్ట్‌ను ప్రకటించింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రేపు మధ్యాహ్నానికి పుదుచ్చేరి వద్ద తుపాన్ తీరాన్ని తాకవచ్చు. దీనితో దక్షిణ కోస్తా జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది.