నటి సమంతకు తీవ్ర విషాదం
నిన్నటి వరకూ సందడిగా ఆడి పాడిన నటి సమంత తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె తండ్రికి దూరమయ్యారు. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె ఇన్‌స్టాలో పోస్టు పెడుతూ, హృదయం ముఖ్యలైన ఎమోజీని పోస్టు చేశారు. ‘నాన్నా మనం మళ్లీ కలిసే వరకూ’ అని కామెంట్ పెట్టారు. దీనితో పలువురు ఆమెకు ధైర్యం చెపుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఆయన తన జీవితంలో అడుగడుగునా తనకు అండగా నిలిచారని, ఎంతో ప్రోత్సహించారని ఆమె పలుమార్లు మీడియాతో పేర్కొన్నారు.