తెలంగాణాలో SI అభ్యర్థులకు అలర్ట్
తెలంగాణాలో పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. అయితే ఇప్పటికే దీనికి సంభందించి సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయ్యింది. దీంతో వారంలోనే SI పోస్టులకు ఎంపికైన 579మంది అభ్యర్థుల తుది జాబితాను TSLPRB విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే అభ్యర్థుల వ్యక్తిగత ప్రవర్తన,నేరచరిత్రపై స్థానిక పోలీస్ స్టేషన్ల నుంచి వివరాలు సేకరించిన తర్వాత వారికి నియామక పత్రం అందజేస్తారు. అనంతరం వారికి ఆగష్టులో ట్రైనింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలంగాణాలో SI పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు అలర్ట్‌గా ఉండాలని TSLPRB అధికారులు సూచించారు.