NewsTelangana

ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా

Share with

తెలంగాణలో రాజకీయం మునుగోడు కేంద్రంగా నువ్వా నేనా అన్నట్టుగా రంజుగా సాగుతున్న తరుణంలో ఇవాళ సాయంత్రం ఓ చానల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు కొనుగోలు చేస్తున్నారంటూ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కొనసాగింది. ఒక ఛానల్ లో రావడం ఆలస్యం ఇక అన్ని మీడియాలోనూ ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ, తిరుపతి నుంచి… డబ్బు సంచులతో కొందరు దిగారంటూ ప్రచారం ఉధృతమైంది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులను కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధమైందంటూ కథనాలు ముందస్తు పథకం ప్రకారం సిద్ధమైపోయాయి. వందల కోట్ల ఆశ చూపారంటూ కూడా కథనాలు అందించారు. కట్ చేస్తే ఇదంతా ప్లాంటెడ్ స్టోరీ అని రుజువవుతోంది. మొత్తం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఉన్న వ్యక్తి ఎవరిని ఆరా తీయాగా ఆయన పేరు నందు అని.. ఆయన టీఆర్ఎస్ ముఖ్యనేతలకు అత్యంత సన్నిహితుడని తేలింది. కేసీఆర్ బంధువు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావుతో నిందితుడు నందు ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

పై ఫోటోలో ఉన్న వ్యక్తి, దిగువన ఉన్న నాయకుడికి ఫోటోలు రెండూ పరిశీలించి చూస్తే… ఈ మొత్తం వ్యవహారం ఒక ఫార్స్ అని స్పష్టమవుతోంది. టీఆర్ఎస్ నేతలతో నేడు పోలీసులకు పట్టు బడిన నందు ఫోటోలను పరిశీలిస్తే మొత్తం కుట్ర కోణం ఏంటో అర్థమవుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి వార్తలు హైలెట్ అవుతున్న తరుణంలో అసలు ఆ ఫోటోల్లో ఉన్న వ్యక్తి ఎవరన్నదానిపై విస్తృత చర్చ జరుగుతోంది.

తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాతోనూ నిందితుడు నందు ఉన్న ఫోటోను ఇక్కడ చూడొచ్చు… సదరు వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితుడని ఈ రెండు ఫోటలతో క్లారిటీ వస్తుంది. మునుగోడు ఉపఎన్నిక హోరాహోరీ జరుగుతున్న సమయంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఎందుకు బయటకు వచ్చిందన్నదానిపై కూపీ లాగితే అసలు విషయాలన్నీ బయటకు వస్తున్నాయ్. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోపాటు, టీఆర్ఎస్ ముఖ్యనేతలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక మొత్తం వ్యవహారంలో నిందితుడెవరో అర్థమైపోయింది. ఇక డబ్బు సంచలంటూ జరుగుతున్న ప్రచారం గుట్టు రట్టయ్యింది. డబ్బు సంచులు ఎవరి కారు నుంచి వచ్చాయన్న దానిపై క్లారిటీ వస్తుంది. ఎమ్మెల్యేల కొనుగోలు డబ్బు సంచులకు సంబంధించి బ్యాగులు ఉన్న కారు ఎమ్మెల్యే గువ్వల అనుచరుడుగా తేలింది. గువ్వల బాలరాజు అనుచరుడు గంధవరం దిలీప్ కుమార్ వాహనం ఇటు హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ తిరుగుతున్న సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనలతో అనేక చలానులు నమోదవడాన్ని కూడా చూడాల్సి ఉంది.

ఆ వాహనం గంధవరం దిలీప్ కుమార్‌దిగా గుర్తించారు. ఈ వాహనం తరచుగా హైదరాబాదులో నాగర్ కర్నూల్ లో తిరుగుతున్నట్టు తేలింది. హైదరాబాదులో ఈ వాహనానికి సంబంధించి పలు చలానాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే గాని మొత్తం లోతు ఎంతో తెలిసే అవకాశం లేదనిపిస్తోంది. ఇక నిందితుడు నందు టీఆర్ఎస్ నాయకుడి దాసోజు శ్రావణ్‌తో నిందితుడు కలిసి దిగిన ఫోటోలను కూడా ఒకసారి పరిశీలిస్తే కుట్ర అసలు ఎక్కడ మొదలైంది అర్థమవుతుంది.

ఇక మొత్తం వ్యవహారంలో నిందితుడు నందూ కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటోను చూస్తే.. అసలు మొత్తం ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఎలా రక్తికట్టించారో అర్థం చేసుకోవచ్చు. కొల్లాపూర్ ఎమ్మెల్యే కుటుంబ కార్యక్రమాల్లోనూ పాల్గొన్న చిత్రాలను చూస్తే.. ఇదంతా ఎప్పట్నుంచో జరుగుతున్న కుట్ర అని తెలుస్తుంది.

సీఎం కేసీఆర్ రాజకీయ సలహాదారుడు సుభాష్ రెడ్డితో నందు ఉన్న చిత్రం ద్వారా కూడా ఇక్కడ వీక్షించవచ్చు.

మెడికల్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో ప్రధాన నిందితుడు పరిచయాన్ని చూడొచ్చు. అంటే మొత్తం వ్యవహారంలో నిందితుడు టీఆర్ఎస్ పార్టీ నేతలకు అత్యంత సన్నిహితుడని అర్థమవుతుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిగ్గుతేల్చితే.. ఇంకా ఎవరెవరున్నారన్నదానిపైనా క్లారిటీ వస్తుంది.

మొత్తం వ్యవహారంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. పోలీసులు చెబుతున్నట్టుగా మొత్తం వ్యవహారంలో బీజేపీ నేతలు ఎవరూ లేరని ఆమె తేల్చి చెప్పారు. కేసీఆర్ మరోసారి సినిమా కథ అల్లారని… టీఆర్ఎస్ స్క్రిప్టును పోలీసులు చదివారన్నారు. మునుగోడులో ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీఆర్ఎస్ ఓ డ్రామా కంపెనీ అని రుజువయ్యిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. మూడు రోజులుగా ఫామ్ హౌస్ నుంచి కుట్ర చేశారన్నారు.