ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గోందియా జిల్లాలోని కొహ్మారా హైవేపై ఇవాళ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. భారీ సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. మహారాష్ట్ర ఆర్టీసీ బస్సు నాగ్ పూర్ నుంచి గోందియాకు వెళ్తుంది. బృందావన తోల గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనాస్థలంలోనే ఎనిమిది మంది చనిపోగా, 30 మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం గోందియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ఇద్దరు కన్నుమూశారు.