NationalNews

తెలంగాణలో దూసుకుపోతున్న బీజేపీ… ఇండియా టీవీ సర్వే వెల్లడి

Share with

దేశ వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయన్నదానిపై ఇండియా టీవీ సర్వే నిర్వహించింది. దేశంలో ప్రధాని మోదీ క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందని సర్వే ఘంటాబజాయిస్తే… తెలంగాణలో కూడా ఫలితాలు అదే మాదిరిగా రాబోతున్నాయని సర్వే అంచనా వేసింది. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ భారీగా పుంజుకుంటుందని సర్వే తేల్చి చెప్పింది. అధికార టీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు క్షీణిస్తోందని… కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా ఉందని ఇండియా టీవీ స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఓట్ షేర్… 42 శాతం నుంచి 34 శాతానికి తగ్గుతుందని… బీజేపీ ఓట్ షేర్ 20 నుంచి 39 శాతానికి పెరుగుతుందని… కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ 30 నుంచి 14 శాతానికి పడిపోతుందని సర్వే చెప్పింది. సర్వే ప్రకారం తాజాగా ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ 9 ఎంపీల నుంచి 8 ఎంపీలకు, బీజేపీ 4 ఎంపీల నుంచి 6 ఎంపీలకు, కాంగ్రెస్ పార్టీ 3 ఎంపీల నుంచి 2 ఎంపీలు, మజ్లిస్ 1 ఎంపీ స్థానం గెలుచుకుంటాని ఇండియా టుడే సర్వే తెలిపింది.

తెలంగాణలో ఇటీవల ఆరా సర్వే చేయగా… వచ్చిన ఫలితాలతో పెద్ద దుమారం రేగింది. ఆరా సంస్థ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని తక్కువ చేసి చూపించిందని విమర్శలు వెల్లువెత్తాయ్. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే… టీఆర్ఎస్ పార్టీకి 38.88 శాతం ఓట్లు, బీజేపీకి 30.48 శాతం ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 23.71 శాతం ఓట్లు వస్తాయని.. జిల్లాల వారీగా వివరించి మరీ చెప్పింది ఆరా సర్వే సంస్థ. బీజేపీ గ్రాఫ్ ఎందుకు పెరుగుతోంది… టీఆర్ఎస్, కాంగ్రెస్ గ్రాఫ్ ఎందుకు తగ్గుతుందో వివరించింది. 2018 ఎన్నికల తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఎలా పుంజుకుందో సంస్థ ఎండీ ఆరా మస్తాన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎలా డీలా పడిందో తేల్చారు. ఈ పరిస్థితుల్లో ఇండియా టీవీ సర్వే సంచలనంగా మారింది. ఆరా సర్వే సంస్థ కాంగ్రెస్ పార్టీకి 23.71 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని చెబితే… ఇండియా టీవీ కేవలం హస్తం పార్టీకి 14 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని చెప్పడం విశేషం. మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి ఆరా సంస్థ 38.88 శాతం ఓట్లు వస్తాయని చెబితే… ఇండియా టీవీ 34 శాతం వస్తాయంది. ఇక బీజేపీకి ఇండియా 39 శాతానికి పెరుగుతాయని ఇస్తే… ఆరా సంస్థ 30.48 శాతం ఓట్లు వస్తాయని చెప్పింది. దేశంలోనే అతి పెద్ద టీవీ చానెల్ గా గుర్తింపు పొందిన ఇండియా టీవీ సర్వే… తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్ వివరించింది. ఆరా సర్వే ద్వారా మూడ్ ఆఫ్ ద తెలంగాణ స్పష్టమవగా… ఇప్పుడు ఇండియా టీవీ సర్వే కూడా అదే లైన్లో సర్వే ఫలితాలు ఉంటాయని జోస్యం చెప్పింది.

మొత్తంగా తెలంగాణలో బీజేపీ శరవేగంగా పెరుగుతోందని అటు ఇండియా టీవీ, ఇటు ఆరా సర్వే సంస్థలు అభిప్రాయపడ్డాయ్. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ డౌన్ ఫాల్ రోజు రోజుకు పెరుగుతోందని రెండు సర్వేలు అభిప్రాయపడ్డాయ్. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగానూ విఫమవుతోందన్న సంకేతాలను సర్వేలు తేల్చి చెప్పాయ్. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా ఎలా పడిపోతుందో… తెలంగాణలోనూ కుచించుకుపోతుందని సర్వేలు స్పష్టం చేశాయ్. హస్తం పార్టీ రోజు రోజుకు క్షీణిస్తోందని ఆరా సర్వే సంస్థ చెప్పగా… కాంగ్రెస్ నేతలు నానా యాగీ చేశారు… ఇప్పుడు ఇండియా టీవీ ఐతే … తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిందని స్పష్టం చేసింది. ఆరా సర్వే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో 23.71 శాతం ఓట్లు వస్తాయని చెబితే… ఇండియా టీవీ కేవలం 14 శాతమే ఓట్లు వస్తాయని విస్పష్టంగా చెప్పింది.