Home Page SliderInternational

‘ఉక్రెయిన్‌తో చర్చలకు వారి సహాయం అవసరం’…పుతిన్ కీలక వ్యాఖ్యలు

Share with

ఉక్రెయిన్‌తో తాము చర్చలకు సిద్దమేనంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చర్చలకు భారత్, చైనా, బ్రెజిల్ దేశాలు కూడా కలిసి సహాయం చేయాలని కోరారు. రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవడానికి సిద్దపడ్డానని పేర్కొన్నారు. దాదాపు రెండున్నరేళ్లుగా ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న రష్యా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. యుద్ధం మొదలైన కొత్తలోనే తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో ఒప్పందం కుదుర్చుకున్నామని, కానీ దీనిని ఉక్రెయిన్ అమలు చేయలేదని విమర్శించారు. ఈ ఒప్పందం ఆధారంగానే ఇప్పడు శాంతి చర్చలు జరుపుతామన్నారు.  ఈ ఒప్పందంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రతినిధుల బృందం సంతకాలు చేసిందని, కానీ అమెరికా, కొన్ని యూరోప్ దేశాల ఒత్తిడి కారణంగా అమలు చేయలేదని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భారత్ ప్రధాని మోదీకి, పుతిన్‌కు మధ్య నిర్మాణాత్మక సంబంధాలున్నాయని పుతిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. భారత్‌కు ఉక్రెయిన్‌తో స్నేహ సంబంధాలున్నందున మోదీ నేరుగా వారితో మాట్లాడగలరని, శాంతికి బాటలు వేస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.