సీఎంకు త్రుటిలో తప్పిన ప్రమాదం
ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు చంద్రబాబు మధురానగర్ వెళ్లారు. వరద నీరు సరిగా కనిపించకపోవడంతో రైల్వే ట్రాక్ పైకి ఎక్కారు. ఆయన వెంట టీడీపీ శ్రేణులు కూడా ఉన్నారు. కాలినడకన రైలు వంతెన పైకి వెళ్లి బుడమేరును చంద్రబాబు పరిశీలించారు. వంతెనపై సీఎం నడుస్తుండగానే, ఓ రైలు ఎదురుగా వచ్చింది. దాంతో అందరూ షాక్ కు గురయ్యారు. ఆయనకు కేవలం మూడు అడుగుల సమీపం నుంచి రైలు వెళ్లింది. చంద్రబాబు ట్రాక్ కు కొంచెం పక్కగా నిలబడడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. రైలు తనకు తగలకుండా చంద్రబాబు వంతెనపై ఎంతో జాగ్రత్తగా నిల్చొన్నారు. సీఎం సేఫ్ గా ప్రాణాలతో బయటపడడంతో అధికారులు, పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.