శంషాబాద్ లో సోనుసూద్.. విద్యార్థులతో సెల్ఫీలు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటుడు సోనూసూద్ పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులను అలరించి వారితో కలిసి సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా సోనూసూద్ మీడియాతో మాట్లాడుతూ.. తాను పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని అయినా తెలుగు ప్రజలు తన కుటుంబ సభ్యులు అని అన్నారు. తన సోదరుడు సిద్ధూరెడ్డి పేద ప్రజల కోసం ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడం గర్వంగా ఉందన్నారు. అతడిని ఆదర్శంగా తీసుకుని సొసైటీలోని వ్యక్తులు సామాజిక సేవకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా సోనూసూద్ హామీ ఇచ్చారు.