నయనతార షాకింగ్ కామెంట్స్
‘అబద్దాలతో పక్క వారి జీవితాలను నాశనం చేయాలనుకునే వారు జాగ్రత్త. అది మీకు ఏదో ఒక రోజు వడ్డీతో సహా తిరిగి వస్తుందని గుర్తు పెట్టుకోండి’. అంటూ లేడీ సూపర్ స్టార్ నయనతార సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. నటుడు ధనుష్, నయనతార మధ్య నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో వివాదం నెలకొంది. తాను నిర్మాతగా ఉన్న సినిమా ‘నానుమ్ రౌడీదాన్ చిత్రంలో బిట్స్ నయనతార వాడుకున్నారని ధనుష్ రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ కోర్టులో దావా వేసిన సంగతి తెలిసేందే. ఈ విషయంలో నయనతార తాజాగా ఈ సందేశం పెట్టడంతో అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ధనుష్‌ను ఉద్దేశించే ఇలాంటి కామెంట్లు పెట్టారని చర్చించుకుంటున్నారు.