నటి ట్విషా శర్మ మృతి వెనుక షాకింగ్ నిజాలు..
తెలుగు చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫేమ్, మాజీ మిస్ పూణే ట్విషా శర్మ మృతి కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భోపాల్‌లోని తన అత్తవారింట్లో మే 12న ఆమె అనుమానాస్పద స్థితిలో ఫ్యాన్‌కు వేలాడుతూ శవమై కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది. నోయిడాకు చెందిన ట్విషా, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన భోపాల్‌కు చెందిన లాయర్ సమర్థ్ సింగ్‌ను డిసెంబర్ 2025లో వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన ఐదు నెలలకే ఆమె ప్రాణాలు కోల్పోవడం ఘోరకలిని తలపిస్తోంది.
మరణానికి ఐదు రోజుల ముందు ట్విషా తన తల్లికి పంపిన వాట్సాప్ సందేశాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. “నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్లిపోండి, వీళ్లు నన్ను బతకనివ్వరు. నా జీవితం నరకప్రాయమైంది” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గర్భవతి అయిన ట్విషాను భర్త, అత్త (రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్) అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధించారని మైక్రాన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు దీనిని వరకట్న మరణంగా కేసు నమోదు చేసి, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. నిందితుడైన భర్త సమర్థ్ సింగ్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మరోవైపు, అత్త గిరిబాల సింగ్ ఈ ఆరోపణలను ఖండిస్తూ.. ట్విషాకు డ్రగ్స్ అలవాటు ఉందని కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం కేసును మరో మలుపు తిప్పింది. న్యాయం కోసం ట్విషా కుటుంబం ఎయిమ్స్ (AIIMS) రీ-పోస్ట్‌మార్టం కోసం డిమాండ్ చేస్తోంది.

