బంగారంపై రూమర్స్.. స్పందించిన కేంద్రం
భారత ప్రభుత్వం దేవాలయాల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చుకోబోతోందని, అలాగే ప్రజల దగ్గరున్న బంగారంపై లెక్కలు వేయనుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం గట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ ఊహాగానాలు పూర్తిగా నిరాధారమైనవని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటీవల సికింద్రాబాద్ సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. దిగుమతి వస్తువుల వాడకాన్ని తగ్గించడం కూడా దేశభక్తేనని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఏడాదిపాటు పెళ్లిళ్ల సందర్భంగా వీలైనంత వరకు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని యావత్ దేశానికి సూచించారు. అయితే, ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా చిత్రీకరిస్తూ.. ప్రభుత్వం ఆలయాల బంగారాన్ని స్వాధీనం చేసుకోబోతోందంటూ పుకార్లు సృష్టించారు. ఇటీవల సికింద్రాబాద్ సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. దిగుమతి వస్తువుల వాడకాన్ని తగ్గించడం కూడా దేశభక్తేనని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఏడాదిపాటు పెళ్లిళ్ల సందర్భంగా వీలైనంత వరకు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని యావత్ దేశానికి సూచించారు. అయితే, ఈ వ్యాఖ్యలను కొందరు తప్పుగా చిత్రీకరిస్తూ.. ప్రభుత్వం ఆలయాల బంగారాన్ని స్వాధీనం చేసుకోబోతోందంటూ పుకార్లు సృష్టించారు. ప్రభుత్వం దేవాలయ ట్రస్టుల ఆస్తులను లేదా బంగారాన్ని స్వాధీనం చేసుకుంటుందనే వాదనల్లో ఎటువంటి నిజం లేదు. ఆలయ గోపురాలు, ద్వారాలపై ఉన్న బంగారం దేశ వ్యూహాత్మక నిల్వలకు సంకేతమని వస్తున్న వార్తలు కూడా తప్పుడు సమాచారమే. ఇలాంటి పుకార్లు ప్రజల్లో అనవసర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో బంగారం కొనుగోళ్లపై కానీ, మతపరమైన సంస్థల ఆస్తులపై కానీ ప్రభుత్వం ఎటువంటి ప్రతికూల నిర్ణయాలు తీసుకోలేదు.

