Andhra PradeshHome Page Slider

అవినాష్ తప్పు చేయలేదని నమ్మబట్టే టికెట్ ఇచ్చా: వైఎస్ జగన్

Share with

రాష్ట్రంలో వైఎస్సార్ పేరు లేకుండా చేయాలని కుట్రలు చేస్తోంది ఎవరో గమనించాలన్నారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నమ్ముతున్నానన్నారు జగన్. అవినాష్ ఏ తప్పు చేయలేదని, బలంగా నమ్మా కాబట్టే టికెట్ ఇచ్చానన్నారు. కానీ చెల్లెమ్మలిద్దరూ అవినాష్ జీవితం నాశనం చేయాలని చూస్తున్నారన్నారు. వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవమని, సంతానం ఉన్నది నిజమా కాదా అని జగన్ ప్రశ్నించారు. వివేకాను చంపిన హంతకుడికి మద్దతిస్తోందెవరని జగన్ మండిపడ్డారు. వివేకాను చంపింది ఎవరో జిల్లా ప్రజలందరికీ తెలుసునన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని అణగదొక్కాలని చూస్తోందెవరన్నారు. అవినాష్ అడిగిన ప్రశ్నలకు వీళ్లు జవాబు చెప్పడం లేదన్నారు. టీడీపీ పెద్దలతో కలిసి, అవినాష్ జీవితాన్ని నాశనం చేయడానికి… పసుపు మూకలతో చెల్లెమ్మలు చేయి కలపడం కంటే, దుర్మార్గం మరొకటి ఉందా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో జగన్ కంటే మంచి చేశామని చెప్పే వాళ్లు లేరన్నారు. మన బ్రాండ్ వైఎస్సార్, మన బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకున్నవారికి గుణపాఠం చెప్పేందుకు సిద్ధమా అని కోరారు జగన్. మహానేత వైఎస్సార్ పేరును ఛార్జ్‌షీట్లో పెట్టిందెవరని జగన్ ప్రశ్నించారు. వైఎస్సార్ చనిపోయాక కుట్రలు చేసిందెవరన్నారు. వైఎస్సార్ వారసులెవరో ప్రజలే చెప్పాలన్నారు. పసుపుచీర కట్టుకొని కుట్రలో భాగమైన వీళ్లా వైఎస్సార్ వారసులని జగన్ ఆక్షేపించారు. వైఎస్సార్ శత్రువులతో కలిసిన వీళ్లా వైఎస్సార్ వారసులా అంటూ దుయ్యబట్టారు. మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్ అన్నారు జగన్. కరువు ప్రాంతమైన పులివెందులకు కృష్ణా నీళ్లు తెచ్చామన్నారు. పులివెందుల అంటే ధైర్యం, అభివృద్ధి, ఒక సక్సెస్ స్టోరీ అని చెప్పారు.

నోటాకు కూడా వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా చేసిన, రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్సార్ పేరును ఛార్జ్ షీట్లో పెట్టిన పార్టీకి, వైఎస్సార్ పేరును తుడిచివేయాలని, కనబడకుండా చేయాలని ప్రయత్నించిన, ప్రయత్నిస్తున్న వారికి ఓటేయడమంటే దాని వల్ల ఎవరికి లాభమో ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఓట్లు చీలిస్తే, బాబుకు, బీజేపీకి కూటమికి అడ్వాంటేజ్ అవుతుందనే చెల్లెమ్మెలు కుట్రులు చేస్తున్నారని జగన్ ఆక్షేపించారు. మన ఓట్లను విడగొట్టి కూటమిని గెలిపించాలన్న కుట్ర చేస్తున్నారని… వైఎస్సార్‌పై ఎవరికి ప్రేమ ఉందో గమనించాలన్నారు.