Andhra PradeshHome Page Slider

టీడీపీ హామీలపై బీజేపీ కీలక నేత హాట్ కామెంట్స్

Share with

ఏపీలో పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నప్పటికీ టీడీపీ-బీజేపీ-జనసేన మధ్య అగాధం రోజు రోజుకు పెరుగుతోంది. మంగళగిరిలో ప్రధాని మోదీ సభ తర్వాత కూటమికి ఊపు రావాల్సి ఉన్నప్పటికీ మూడు పార్టీలు కలిసి ముందడుగు వేయలేకపోతున్నట్టుగా కన్పిస్తోంది. పై స్థాయిలో నేతలు ఒకరితో ఒకరు కలిసిపోయినప్పటికీ గ్రౌండ్‌లో మాత్రం బీజేపీ, టీడీపీ కార్యకర్తల మధ్య అంత సఖ్యత లేనట్టుగా సీన్ కన్పిస్తోంది. 1994 నుంచి బీజేపీలో ఉంటున్న నేత, బీజేపీ ముఖ్యనేత యడ్లపాటి రఘునాథబాబు, తాజా వ్యవహారాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కూటమి ఎందుకు ఏర్పడిందన్నది మరచిపోయి టీడీపీ వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా, వైసీపీ సర్కారును గద్దె దించాలన్న లక్ష్యంతోనే ఏర్పడ్డామని చెప్పారు. కానీ తాము టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో హామీలకు బీజేపీ గ్యారెంటీ తీసుకోదన్నారు.

2014లో కూడా ఇలాగే వందల పేజీల మేనిఫెస్టో పెట్టి ఆ తర్వాత ఇంటర్నెట్లోంచి కూడా తీసేశారని ఆయన గుర్తు చేశారు. హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం వల్లే, 2019లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పప్పూ, బెల్లాల్లా ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు చేస్తుంటే విమర్శిస్తున్న మనం, అదే దారిలో పథకాలు అందించడం ఎంత వరకు కరెక్ట్ అని ఆయన ప్రశ్నించారు. ఉన్న పథకాలు అందించడానికి ఆదాయం సరిపోక అప్పులు చేస్తున్న సమయంలో, టీడీపీ మేనిఫెస్టోలోని పథకాలు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. కూటమి, వైసీపీ సర్కారును, జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టాలని, వాటినే ఫోకస్ చేయాల్సి ఉండగా… ఇప్పుడు, ఉచిత హామీలు, పైపెచ్చు జగన్ ఇచ్చే వాటికంటే డబుల్ ఇస్తామన చెప్పడం విడ్డూరమన్నారాయన. క్రెడిబిలిటీని పోగొట్టుకోవడం ఇష్టం లేకే తాము మేనిఫెస్టోకు దూరంగా ఉన్నామన్నారు.