Home Page SliderTelangana

తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే..!?

Share with

తెలంగాణలో ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం ఫలితాలు ఇవాళ విడుదల కాగా, టెన్త్ ఫలితాల విడుదల తేదీని విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణ 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30న విడుదల కానున్నాయి. 30వ తేదీ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. కాగా, తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు నిర్వహించగా.. 10వ తరగతి పరీక్షలకు మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలు ముగిసిన వెంటనే మరుసటి రోజు నుండి అంటే ఏప్రిల్ 3వ తేదీ నుండి స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 13 వరకు కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ నిర్వహించారు. ఈసారి ఫలితాల వెల్లడికి 27 రోజులు పట్టింది. 10వ తరగతి ఫలితాలను ఏప్రిల్ 30న విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సన్నాహాలు చేస్తోంది.