Andhra PradeshHome Page Slider

రెండు పార్టీల మధ్య గ్యాప్, గ్రౌండ్ రియాల్టీ ఇదేనంటున్న బీజేపీ పెద్దాయన

Share with

ఏపీలో కూటమి పొత్తును నిర్ణయించింది బీజేపీ హైకమాండేనని, కానీ ఏపీలో అది పూర్తిగా అమలు కావడం లేదంటూ బాంబు పేల్చారు బీజేపీ ముఖ్యనేత యడ్లపాటి రఘునాథబాబు. పార్టీలో సీట్లను అనుకూలరకు ఇచ్చుకురన్నారని, కానీ, చాలా మంది ఆ నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గాల్లో అభ్యర్థులు గట్టిగా ప్రయత్నిస్తున్నా, కింద స్థాయిలో కేడర్‌లో… బీజేపీపైనా, మోదీపైనా విద్వేషపూరితమైన ప్రచారం చేశారన్నారు. గత ఐదేళ్లలో తెలుగు మీడియా, మోదీ పట్ల విద్వేషం నింపిందన్నారు. గ్రౌండ్ లెవల్లో జనసేనతో తమకు ఇబ్బంది లేదన్న ఆయన టీడీపీ కార్యకర్తలతో ఇబ్బంది తలెత్తుతుందన్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు, బీజేపీ నేతలను, కార్యకర్తలను కించపర్చుతున్నారన్నారు. మోదీపైనా, కేంద్రంపైనా విద్వేష ప్రచారం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తమిళనాడు, కేరళ, తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున పెరుగుతుంటే ఆంధ్రాలో అలా పెరిగే అవకాశాన్ని, పెరగడం వల్ల కలిగే లాభాన్ని పొందలేకపోతే, దానికి పూర్తి బాధ్యత మీడియా చేసిన దుష్ప్రచారమేన్నారు. వాళ్లవేళ్లతో కన్నుపొడిచినట్టేనన్నారు. 2018-19లో చంద్రబాబుకు తప్పుడు సలహాలిచ్చి ఎన్డీఏకూ దూరం చేశారని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ఏం మాట్లాడకున్నా, మీడియా మాత్రం అది కంటిన్యూ చేయడం వల్ల అలయన్స్ ఖరారైనప్పటికీ… కింది స్థాయిలో అడ్డంకులేర్పడుతున్నాయననారు. ఏపీలో బీజేపీ లేదని ఎగతాళి చేయడం దారుణమన్నారు. దీని వల్ల కేడర్‌లో అసంతృప్తి కలుగుతోందన్నారు.