Home Page SliderNational

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ విషయంలో సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

Share with

ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ విషయమై తాత్కాలిక బెయిల్ మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు తెలిపింది. మార్చి 21న లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం కోసం ఆయనకు బెయిల్ ఇచ్చే విషయమై మే 7న కోర్టు ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ వ్యవహారంపై ప్రిపేరై ఉండాల్సిందిగా ఈడీ, కేజ్రీవాల్ న్యాయవాదులను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇప్పటికి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సహా ముగ్గురు ఆప్ నేతలను అరెస్ట్ చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే అరెస్టు చేసిందంటూ ఆయన తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలిపారు. ఈడీ 9 సమ్మన్లకు కేజ్రీవాల్ స్పందించారని, విచారణకు హాజరుకానంత మాత్రాన అరెస్టు చేయాలన్న రూల్ ఏమీ లేదని ఆయన వాదించారు.