Home Page SliderNational

ఎవరీ కేఎల్ శర్మ, అమెథీలో టికెట్ ఎలా వచ్చింది?

Share with

గాంధీ కుటుంబానికి చిరకాల విధేయుడిగా ఉన్న కిషోరి లాల్ శర్మను కాంగ్రెస్ అమేథీ నుంచి పోటీకి దింపింది. వారం రోజుల ఉత్కంఠకు తెరదించిన పార్టీ ఇవాళ నిర్ణయం వెల్లడించింది. అమేథీని తిరిగి పోటీ చేసి విజయం సాధించాలని భావించిన రాహుల్ గాంధీని పార్టీ రాయ్‌బరేలీ అభ్యర్థిగా ప్రకటించింది. 2019లో స్మృతి ఇరానీ చేతిలో పరాజయంతో గాంధీ కుటుంబం కంచుకోట అమేథీని రాహుల్ కోల్పోయారు. రాహుల్ అమేథీలో ఓడినప్పటికీ, కేరళ వాయనాడ్ నుంచి విజయం సాధించారు. అయితే ఇప్పుడు రాహుల్ రాయ్‌బరేలీలో పోటీకి దిగుతుండటంతో… యూపీలో గాంధీ కుటుంబ కంచుకోట అయిన అమేథీ నుంచి పోటీ చేసేందుకు అవకాశం లభించడంపై కేఎల్ శర్మ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. “నాలాంటి చిన్న కార్యకర్తకు అమేథీ నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను కష్టపడి పని చేస్తాను. గత 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గం కోసం పని చేస్తునే ఉన్నానని ఆయన చెప్పారు. రాహుల్ గాంధీ భయపడి అమేథీకి దూరమయ్యారని బీజేపీ చేసిన ఆరోపణలపై, రాహుల్ గాంధీ దేశం మొత్తం కోసం పోరాడుతున్నారని కేఎల్ శర్మ అన్నారు. రాహుల్ గాంధీ అమేథీని విడిచి పారిపోయేవాడు కాదని, దేశం మొత్తం కోసం, దేశ ప్రజలందరి కోసం పోరాడుతున్నాడని చెప్పారు.

కేఎల్ శర్మ అసలు ఎవరు?
కిషోరి లాల్ శర్మ లేదా KL శర్మ పంజాబ్‌లోని లూథియానాకు చెందినవారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌తో అనుబంధం కలిగి ఉన్నారు.
కిషోరి లాల్ శర్మ 1987లో తొలిసారిగా అమేథీకి వచ్చి ఆ తర్వాత నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్నారు.
కిషోరి లాల్ శర్మ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడని పార్టీ వర్గాలు చెబుతాయి. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాత గాంధీ కుటుంబంతో అతని బంధం మరింత బలపడింది.
సోనియా గాంధీ 1999లో అమేథీ నుంచి తొలిసారి గెలుపొందడంలో కీలక పాత్ర పోషించిన కెఎల్ శర్మ, ఎంపీగా విజయంలో కీలక పాత్ర పోషించారు.
రాహుల్ కోసం సోనియా గాంధీ సీటును ఖాళీ చేసిన తర్వాత శర్మ అమేథీ, రాయ్‌బరేలీలో రెండు నియోజకవర్గాల వ్యవహారాలను చూసుకుంటున్నారు.