Andhra PradeshHome Page Slider

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ ప్రచారం నమ్మితే అంతే అంటున్న బీజేపీ

Share with

తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిందని బీజేపీ చాన్నాళ్లుగా మండిపడుతోంది. అమలుగాని హామీలతో అధికారంలోకి వచ్చిన రెండు ప్రభుత్వాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నాయని విమర్శలు గుప్పించారు బీజేపీ ముఖ్యనేత యడ్లపాటి రఘునాథబాబు. కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో 5 హామీలతో అధికారంలోకి రావడంతో, తెలంగాణలో 6 హామీలంటూ ఓటర్లను బురిడీ కొట్టించారని, వాటినే.. ఏపీలో లాంగ్వేజ్ మార్చి, సూపర్ సిక్స్ అంటున్నారని విమర్శించారాయన. చంద్రబాబువి కాంగ్రెస్ మార్క్ హామీలని వాటిని అమలు చేయడం కష్టమన్నారు. సూపర్ 6 గురించి చాన్నాళ్లుగా టీడీపీ చెప్తోందని, ఇప్పుడు మేనిఫెస్టోతో ఆచరణ సాధ్యం కానీ హామీలు తెచ్చారన్నారు. మొత్తంగా చంద్రబాబు, కాంగ్రెస్ మార్క్ చూపిస్తున్నారన్నారు. కర్నాటక, తెలంగాణలో హామీలు అమలు చేయలేకపోవడం ఎలాగో.. అలాగే ఏపీలోనూ సీన్ ఉంటుందని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు సాధ్యమేనా… అన్నది ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. హామీలు రాష్ట్రాని ఎంతో బర్డెన్ అని అన్నారు. రెవిన్యూ సోర్సులు ఎక్కువగా ఉన్న కర్నాటకలో ఇచ్చిన 5 హామీలు అమలు చేయలేక అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు రఘునాథబాబు. ఇప్పటికే లోటులో ఉన్న రాష్ట్రంపై ఇంత బర్డెన్ పెట్టడం దారుణమన్నారు. పింఛన్ 4 వేలుతోపాటుగా సూపర్ 6 పథకాలన్నీ ఆచరణ సాధ్యం కాదన్నారు.

ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు చేశాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా చాలా వరకు చేసిందన్నారు. ఇందుకోసం కేంద్రం 200 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిందన్నారు. బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పుడు.. కేంద్రం తీసుకొచ్చిన పథకాలపై విమర్శించడం దారుణన్నారు. కేంద్రం వద్ద డబ్బు తీసుకొని, వారి సూచనలతో కార్యక్రమం చేపట్టినప్పుడు, చంద్రబాబు ఇలా ప్రకటించడం విడ్డూరమన్నారు. ఆస్తులు పోతాయని, లాగేసుకుంటారని అపోహలు సృష్టించడం ఏ పద్ధతని ప్రశ్నించారు. కేంద్రమైనా, రాష్ట్రమైనా రాజ్యాంగానికి కట్టుబడే పనిచేస్తాయన్న ఆయన.. దేశంలో ఎవరైనా మరెవరివో స్థలాలను అక్రమంగా కొట్టేస్తే కోర్టులు, ప్రభుత్వ యంత్రాంగాలు చూస్తూ ఊరుకుంటాయా అని ప్రశ్నించారు. కేవలం అపోహ సృష్టించి… రాజకీయంగా లబ్ధిపొందాలని చూడటం దారుమణమన్నారు. ఇలాంటి ప్రచారం చేయడం వల్ల… చావుబతుకుల మధ్య, చికిత్సలు చేసుకుంటున్నవారికి జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారన్నారు రఘునాథబాబు.