Andhra PradeshHome Page Slider

నమ్మించి నట్టేట ముంచడమే చంద్రబాబు అజెండా అంటున్న బీజేపీ

Share with

తెలంగాణ, కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చిందని బీజేపీ చాన్నాళ్లుగా మండిపడుతోంది. అమలుగాని హామీలతో అధికారంలోకి వచ్చిన రెండు ప్రభుత్వాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోతున్నాయని విమర్శలు గుప్పించారు బీజేపీ ముఖ్యనేత యడ్లపాటి రఘునాథబాబు. కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో 5 హామీలతో అధికారంలోకి రావడంతో, తెలంగాణలో 6 హామీలంటూ ఓటర్లను బురిడీ కొట్టించారని, వాటినే.. ఏపీలో లాంగ్వేజ్ మార్చి, సూపర్ సిక్స్ అంటున్నారని విమర్శించారాయన. చంద్రబాబువి కాంగ్రెస్ మార్క్ హామీలని వాటిని అమలు చేయడం కష్టమన్నారు. సూపర్ 6 గురించి చాన్నాళ్లుగా టీడీపీ చెప్తోందని, ఇప్పుడు మేనిఫెస్టోతో ఆచరణ సాధ్యం కానీ హామీలు తెచ్చారన్నారు. మొత్తంగా చంద్రబాబు, కాంగ్రెస్ మార్క్ చూపిస్తున్నారన్నారు. కర్నాటక, తెలంగాణలో హామీలు అమలు చేయలేకపోవడం ఎలాగో.. అలాగే ఏపీలోనూ సీన్ ఉంటుందని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు సాధ్యమేనా… అన్నది ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. హామీలు రాష్ట్రాని ఎంతో బర్డెన్ అని అన్నారు. రెవిన్యూ సోర్సులు ఎక్కువగా ఉన్న కర్నాటకలో ఇచ్చిన 5 హామీలు అమలు చేయలేక అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు రఘునాథబాబు. ఇప్పటికే లోటులో ఉన్న రాష్ట్రంపై ఇంత బర్డెన్ పెట్టడం దారుణమన్నారు. పింఛన్ 4 వేలుతోపాటుగా సూపర్ 6 పథకాలన్నీ ఆచరణ సాధ్యం కాదన్నారు.

సంపద సృష్టించిన తర్వాత అంటే… వచ్చే మూడేళ్లు ఏ పథకాలు ఇవ్వకుండా చివరి రెండేళ్లు సంపదను పంచుతారా అని ఆయన ప్రశ్నించారు. అల్లావుద్దీన్ అద్భుత దీపంలా పథకాలు ఇవ్వడం సరికాదన్నారు. ఆదాయం ప్రస్తుతం వడ్డీలు కట్టడానికే సరిపోవడం లేదన్నారు. పథకాలను కేంద్ర సహకారంతో చేస్తామంటున్నారని… కేంద్ర సహకారం అన్నది ఒక పరిమితికి లోబడి మాత్రమే ఉంటుందన్నారు. కేంద్రం నుంచి జీఎస్టీ వాటా రాష్ట్రానికి వస్తోందని, గతంలో 32 శాతముంటే, మోదీ దానిని 42 శాతం చేశారన్నారు. కేంద్రం ఆయా రాష్ట్రాలకు ఎలిజిబిలిటీ ప్రకారం నిధులు ఇస్తోందన్నారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రం వివక్ష చూపించడం లేదన్నారు. రెవిన్యూ డెఫిసిట్ కింద, గత పదేళ్లుగా 30 వేల కోట్లుగా వచ్చాయన్నారు. కేంద్రం సాయంతో ఇప్పుడు డెఫిసిట్ తగ్గిందన్నారు. రాష్ట్రాలకు నిధులను అర్హత మేరకు ఇస్తారని, ఇష్టానుసారం ఇవ్వరన్నారు రఘునాథబాబు. మోదీ మీద ఉన్న నమ్మకానికి, చంద్రబాబు ఇచ్చిన హామీలకు, బీజేపీకి సంబంధం లేదన్నారు. కేంద్రం ఇస్తుందని మాపై నెపం మోపడం కరెక్ట్ కాదన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన సాయం తప్పక చేస్తుందన్నారు. రాష్ట్రంలో రోడ్లకు నిధులు, కేంద్ర సంస్థలు ఏర్పాటు చేయడం, ఆయా శాఖ వారీగా సాయం చేస్తూనే ఉందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత, ఏపీ ఆర్థికంగా ఇబ్బందులెదుర్కొంటుంది కాబట్టే కేంద్రం సాయం చేసిందని, ఇంకా చేస్తుందని ఆయన చెప్పారు. దీన్నే అదనుగా తీసుకొని, కేంద్రం సాయం చేస్తుందని, రేపు రాకపోతే కేంద్రం ఇవ్వలేదుకాబట్టి, సాయం చేయలేదని చెప్పే అవకాశం ఉందన్నారు.