Home Page SliderNationalNews

అయోధ్యలో వైభవంగా దీపావళి వేడుకలు.. సరయూ తీరంలో ప్రపంచ రికార్డు

500 సంవత్సరాల అనంతరం శ్రీరామ జన్మభూమి అయోధ్యలో దీపావళి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. బాల రాముడి ప్రతిష్ట అనంతరం అక్కడి సరయూ తీరంలో దీపాల వరుసలతో రికార్డు సృష్టించబోతోంది. లక్షల ఎకో ఫ్రెండ్లీ దీపాలతో ఇప్పటికే ముస్తాబయ్యింది. దేవాలయం అంతా పూల వనంలా మెరిసిపోతోంది. ముఖ్యమంత్రి యోగి సర్కార్ అయోధ్య వ్యాప్తంగా శ్రీ రామ కథను తెలియజేసే ఘట్టాలతో అందంగా అలంకరించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు అయోధ్యకు భారీగా తరలి వస్తున్నారు. రామాయణ ఘట్టాలతో లేజర్ షో నిర్వహించనున్నారు.