అభిమాని హత్య కేసులో నటుడు దర్శన్‌కు ఊరట
అభిమాని హత్యకేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్‌కు ఊరట లభించింది. వైద్య చికిత్స కోసం ఆయన పెట్టుకున్న మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది కర్ణాటక హైకోర్టు. ఈ కేసులో బుధవారం తీర్పునిస్తూ ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. మూత్రపిండాల అనారోగ్యం, కాళ్ల నరాలలో రక్త ప్రసరణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని, సర్జరీ చేసుకునేందుకు బెయిల్ ఇవ్వాలని సెషన్స్ కోర్టును ఆశ్రయించారు దర్శన్. సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనితో అతడికి ఊరట లభించింది. తన స్నేహితురాలు సహ నటి పవిత్రగౌడను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడన్న కారణంతో అభిమాని రేణుకాస్వామిని చిత్రహింసలకు గురిచేసి, హత్య చేసినట్లు పోలీసులు విచారణలో తెలుసుకున్నారు. ఈ కేసులో దర్శన్, పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు.