చిన్మయి కృష్ణదాస్ అరెస్టు.. రంగంలోకి ఇస్కాన్
చిన్మయి కృష్ణదాస్ అరెస్టు విషయంలో తమకు సంబంధం లేదంటూ ఇస్కాన్ ప్రకటించినట్లు వస్తున్న వార్తలను ఖండించింది ఇస్కాన్. చిన్మయ్ కృష్ణదాస్‌ను ఇస్కాన్ నుండి తొలగించినట్లు ప్రచారం అవుతున్న వార్తలు అబద్దమని తెలిపింది. హిందువులను, వారి ప్రార్థనా స్థలాలను రక్షించడానికి శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన చిన్మయ్ కృష్ణదాస్‌కు ఇస్కాన్ మద్దతు ఉంటుందని తెలిపింది. మరోపక్క ఆయన అరెస్టును ఖండిస్తూ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనను వెంటనే విడుదల చేయకపోతే బంగ్లాదేశ్ ప్రభుత్వం మానవ హక్కుల ఉల్లంఘన శిక్షను ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థ, శాంతి భద్రతలను నిర్వహించడంలో విఫలమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.