దీక్షా దివస్ ఫ్లెక్సీలు చించేసిన కార్యకర్తలు
రెండు రోజుల క్రితం దీక్షా దివస్ సన్నాహక సమావేశానికి ఇంఛార్జిగా వచ్చిన బీఆర్ఎస్ నేత కర్నె ప్రభాకర్ ఎదుటే ఫ్లెక్సీలో తమ ఫొటోలు లేవని పార్టీ యువ నాయకులు బాహాబాహీకి దిగారు. తాజాగా ఇవాళ దీక్షా దివస్ సందర్భంగా పార్టీ యువనేత కురువ విజయ్ కుమార్ గద్వాల పట్టణంలోని పార్టీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని కార్యకర్తలు చించివేశారు.దీంతో వివాదం మళ్లీ రాజుకుంది. అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలను ఎవరికి వారే నిర్వహిస్తూ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారని నేతలపై ఆ పార్టీ కార్యకర్తలే విమర్శలు చేయడం గమనార్హం.