డోన్‌లో క్రిప్టో కరెన్సీ మోసం
నంద్యాల జిల్లా డోన్‌లో క్పిప్టో కరెన్సీ మోసం వెలుగు చూసింది. రామాంజనేయులు అనే వ్యక్తి దాదాపు 200 మంది నుంచి రూ.40కోట్లకు పైగా అక్రమంగా వసూలు చేశాడు. కేవ ఇండస్ట్రీస్ పేరుతో అతను ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో వెల్లడైంది. నిందితుడు బోర్డు తిప్పేయడంతో బాధితులంతా లోకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.