Home Page SliderNews AlertPoliticsTelangana

కేసీఆర్‌పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు..కేటీఆర్ ఫైర్

Share with

తెలంగాణలో రాజకీయాలు వేసవి ఎండలా తీవ్రస్థాయిలో వేడెక్కుతున్నాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేచర్ ఉన్న మనిషిని అంటూ కేసీఆర్ విర్రవీగారని, ఇప్పుడు స్ట్రెచర్ మీద ఉన్నారు, రేపొద్దున మార్చురీకి పోతారని వ్యాఖ్యానించారు. దీనితో బీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావులు తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అన్ని హద్దులూ దాటేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్‌ను మార్చురీకి పోవాలని, మరణాన్ని కోరుకోవడం ఎంత నీచమైన పని అంటూ మండిపడ్డారు. కేసీఆర్ మరణానికి ఎదురెళ్లి తెలంగాణ సాధించిన వీరుడని కొనియాడారు. రేవంత్ రెడ్డి ప్రస్టేషన్‌తో పితృసమానులైన కేసీఆర్‌ చావును కోరుకోవడం తెలుస్తోందన్నారు. రాజకీయ పరిపక్వత లేక, వారి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌పై వాడిన భాషను తక్షణమే ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.