తెలంగాణాలో హిందూ రాజ్యం రావాలి
తెలంగాణ సేఫ్ గా ఉండాలంటే హిందూ రాజ్యం అధికారంలోకి రావాలంటూ బీజెపి సీనియర్ లీడర్ రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.అంతే కాదు…తెలంగాణ బీజెపిలో ఉన్న పాత సామాను అంతా బయటికి పోతే తప్ప టిబీజెపి బాగుపడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన ఆ పార్టీ సీఎంలను రహస్యంగా కలిసి వారికి కావాల్సిన పనులు చక్కబెట్టుకోవడం కొంత మంది బీజెపి నాయకులకు అలవాటుగా మారిపోయిందన్నారు.ఇటువంటి చెత్తసామాను అంతా బీజెపి నుంచి తరిమేయాల్సిన బాధ్యత అధిష్టానంపై ఉందన్నారు.రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీలోని సీనియర్లంతా మండిపడుతున్నారు.ఇతను గాలివాటం లాంటి లీడర్ అని ఎద్దేవా చేస్తున్నారు.