Home Page SliderNational

ఐదోసారి కూడా ‘ఐఐటీ మద్రాసే’ దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థ

Share with

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF) కింద కేంద్రవిద్యాశాఖ రూపొందించిన ఈ జాబీతాలో దేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా నిలిచింది ఐఐటీ మద్రాస్. ఈ జాబితాను ఈరోజే (సోమవారం ) విడుదల చేశారు. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో అందిస్తోన్న విద్యాబోధన, కల్పిస్తున్న మౌలిక సదుపాయాల ఆధారంగా 2016 నుంచి ఈ ర్యాంకులను ప్రకటిస్తున్నారు.

ఇంజనీరింగ్ విభాగం- ఐఐటీ మద్రాస్ ఎనిమిదేళ్లుగా తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. దీని తర్వాత స్థానాలలో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే ఉన్నాయి. 8 వ స్థానంలో ఐఐటీ హైదరాబాద్ నిలిచింది.

బిజినెస్ మేనేజ్‌మెంట్- ఐఐఎం అహ్మదాబాద్ మొదటి స్థానంలో నిలువగా, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం కోళికోడ్ తదుపరి స్థానాలలో నిలిచాయి.

ఫార్మసీ- ఫార్మసీలో మొదటి స్థానాన్ని హైదరాబాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నిలిచింది. జామియా హమ్ దర్ద్, బిట్స్ పిలానీ రెండు, మూడు స్థానాలలో నిలిచాయి.

న్యాయవిద్యలో బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, డిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ, హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వరుస స్థానాలలో నిలిచాయి.

వైద్యవిద్యలో ఢిల్లీలోని ఎయిమ్స్ మొదటి స్థానంలో నిలువగా, చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ( పీజీఐఎంఈఆర్), వేలూరు లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ తర్వాత స్థానాలలో ఉన్నాయి.

ఇక మొత్తంగా ఉత్తమ విద్యాసంస్థల జాబితాలో ఐఐటీ మద్రాస్ మొదటి స్థానంలోనూ, ఐఐఎస్‌సీ బెంగళూరు రెండవ స్థానంలోనూ, ఐఐటీ ఢిల్లీ మూడవ స్థానంలోనూ ఉన్నాయి.