Andhra PradeshHome Page Slider

గాజు గ్లాస్ సింబల్‌ మార్పు… ఎంత మందికి అంటే… !?

Share with

గాజు గ్లాస్ సింబల్ వ్యవహారంపై సాగుతున్న రచ్చకు ఈసీ ఫుల్ స్టాప్ పెట్టింది. ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా మొత్తం వ్యవహారంపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల ఆధారంగా తాము వ్యవహరిస్తున్నామన్నారు. జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎవరికి కూడా గాజు గ్లాస్ ఇవ్వడం లేదని ఈసీ కోర్టుకు స్పష్టం చేసిందన్నారు. జనసేన పోటీ చేస్తున్న మచిలీపట్నం, కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరికీ కూడా గాజు గ్లాస్ ఇవ్వడం లేదన్నారు. జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో స్వతంత్రులకు గాజు గ్లాస్ ఇవ్వమని ఈసీ చెప్పిందన్నారు. ఈసీ నిర్ణయాన్ని కోర్టు ఆమోదించడంతో 7 పార్లమెంట్, 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 15 చోట్ల స్వతంత్ర అభ్యర్థుల గుర్తు మార్చామన్నారు. అభ్యర్థులకు నోటీస్ ఇచ్చి, సెకండ్ ఆప్షన్ ఇచ్చి తర్వాత ఫైనల్ లిస్ట్ రూపొందిస్తామని చెప్పారు. హైకోర్టు ఆమోదం తర్వాత కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల సింబల్ మార్చామన్నారు సీఈవో మీనా.