Home Page SliderNational

సమాజంలో అసమానతలు ఉన్నంత వరకు రిజర్వేషన్లకు మద్దతు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Share with

సమాజంలో ఇప్పుడున్న అసమానతలు పూర్తిగా సమసిపోయే వరకు దేశంలో రిజర్వేషన్ల వ్యవస్థ ఉండాల్సిందేనని ఆర్ఎస్ఎస్ బలంగా విస్వసిస్తోందన్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సంచాలకులు సర్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్, రిజర్వేషన్లు వద్దంటోందంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. స్వతంత్ర్యం తెచ్చామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పే కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రిజర్వేషన్ల ఘనత తమదేనంటూ గొప్పలు పోతుంటుంది. కానీ వాస్తవానికి రిజర్వేషన్ల ఫలాలను అసలైన వర్గాలకు అందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతూనే ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ గానీ, ఆర్ఎస్ఎస్ గానీ, మొదట్నంచి రిజర్వేషన్ల ఫలాలు అర్హులకు అందాలని కోరుకుంటోందన్నారు. రిజర్వేషన్లు ఎవరికైతే దక్కాలో వారికి తప్పనిసరిగా దక్కాలని వారి కోసం రాజ్యాంగం చెప్పినట్లుగా వ్యవహరించాల్సిందేనన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్.

దేశంలో రిజర్వేషన్లను బిజెపి ఎత్తేస్తుందని, అందుకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారంపై మోహన్ భగవత్ తీవ్రస్థాయిలో స్పందించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కునారిల్లిందని వచ్చే రోజుల్లో ఆ పార్టీకి రాజకీయంగా మనుగుడ సాధ్యం కాకపోవడం వల్లే ఇలాంటి ప్రచారాలను పరోక్షం చేయిస్తోందన్న విమర్శలు విన్పిస్తున్న తరుణంలో మోహన్ భగవత్ మొత్తం వ్యవహారంపై స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తన సొంత బలంపై ఎన్నికల్లో విజయం సాధించలేదని చరిత్ర మొత్తం మనకు రుజువు చేస్తోందన్నది గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రత్యర్థులను దొంగ దెబ్బ తీసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో ఆర్ఎస్ఎస్‌పై జరుగుతున్న ప్రచారం అవాస్తవమని మోహన్ భగవత్ తేల్చి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆర్ఎస్ఎస్ పరువు తీయాలని కొందరు కంకణం కట్టుకున్నారని అలాంటి వారి పప్పులు ఉడకబోవని ఆయన కుండబద్ధలుకొట్టారు. రిజర్వేషన్ల విషయంలో ఎప్పటికీ తాము వ్యతిరేకం కాదని రిజర్వేషన్ల పరంపర మూలంగా, అసలైన వ్యక్తులకు మేలు జరిగేలా కొనసాగాలనేదే తమ ఉద్దేశం అని ఆయన స్పష్టం చేశారు. కొందరు అనవసర వివాదాన్ని రాజేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఇలాంటి వారితో అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా వివాదం సృష్టించవద్దని హితవు పలికారు. హైదరాబాద్ సందర్శించిన మోహన్ భగవత్ ఈ విషయంపై ఓ ప్రకటన చేశారు.

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పైన మోహన్ భగవత్ స్పష్టత ఇచ్చారు. రాష్ట్రీయ సంస్థ స్వయంసేవక్ సంఘ్, ఆది నుంచి రిజర్వేషన్లకు వ్యతిరేకమంటూ వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. రిజర్వేషన్లు రాజ్యాంగంలో పొందుపరిచారని, రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా మద్దతు తెలియజేస్తుందని… ఏ వర్గాలకైతే రిజర్వేషన్లు అవసరమో వారికి త్రికరణ శుద్ధిగా కొనసాగాలని, ఇదే తమ విధానమని స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేయలేదని సమావేశాలు నిర్వహించలేదని ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కేవలం ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వల్ల మేలు కంటే ఇలాంటి ప్రచారం ఎక్కువగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి వాదన నమ్మొద్దని దేశ ప్రజలకు తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా సరస్వతి శిశు మందిర్ల నిర్వహణ అద్భుతమంటూ, ఈ సందర్భంగా ఆయన కితాబిచ్చారు. హైదరాబాదులో ప్రారంభించిన పాఠశాలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ అంటే విలువలు, నీతి, నిజాయితీ అంటూ ఆయన తేల్చి చెప్పారు.