Home Page SliderTelangana

మోదీ అంటే గ్యారెంటీ.. గ్యారెంటీ అంటే మోదీ.. సంగారెడ్డిలో తెలుగులో అదరగొట్టిన ప్రధాని

Share with

తెలంగాణలో కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మోదీ గ్యారెంటీ అంటే.. పూర్తి అయ్యే గ్యారెంటీ అంటూ తెలుగులో మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా తెలుగు భాష విన్పిస్తోంది.. తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతున్నారన్నారు మోదీ. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. ఆర్టికల్ 370 ద్వారా దేశానికి కశ్మీర్ ను అనుసంధానం చేశామన్నారు మోదీ. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్నారు. అయోధ్యలో భవ్యమందిర నిర్మాణం చేశామన్నారు. మోదీ గ్యారెంటీ అంటే అమలు చేసి చూపిస్తామన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే సరికొత్త శిఖరాలకు చేర్చాలన్నారు మోదీ. ప్రపంచానికి ఇండియా ఆశాకిరణంలా నిలుస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీకి క్రేజ్ పెరుగుతోందన్నారు. ప్రజల ఆశీర్వాదం వృథా కానివ్వనని గ్యారెంటీ ఇస్తున్నానన్నారు.

మోదీ ఏది చెప్తాడో అది చేసి చూపిస్తాడన్నారు. మోదీ గ్యారెంటీ అంటే అది గ్యారెంటీగా పూర్తవుతుందన్నారు. జమ్ము, కశ్మీర్ నుంచి వంశపారంపర్య రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. టాలెంట్‌కు తాను వ్యతిరేకం కాదన్నారు. వారికి ఫ్యామిలీ ఫస్ట్ అని.. కానీ తనకు దేశం ఫస్ట్ అని మోదీ అన్నారు. విదేశాల్లో భారతీయులను చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఆర్టికల్ 370పై సినిమా కూడా రూపొందిందన్నారు. అయోధ్యలో రాముడికి స్వాగతం పలికామన్నారు. రామాలయంపై మోదీ గ్యారెంటీ పూర్తయ్యిందా లేదా అని ప్రశ్నించారు. ప్రపంచంలో దేశాన్ని మూడో ఆర్థిక శక్తిగా మార్చుతానని మోదీ ఇవాళో గ్యారెంటీ ఇస్తున్నానన్నారు. దేశ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి తీరతానన్నారు. కాంగ్రెస్ నేతలు దేశాన్ని లూటీ చేశారన్నారు.

వేల కోట్ల అవినీతిని బయటపెట్టినందుకే తనను కొన్ని పార్టీలు విమర్శిస్తున్నాయన్నారు మోదీ. కుటుంబాలకు రాష్ట్రాలు రాసిచ్చారా.. వాళ్లకేమైనా లైసెన్సులిచ్చారా అంటూ మండిపడ్డారు మోదీ.