Home Page SliderNational

సెకండ్ ఫేజ్‌లో సాయంత్రం 5 గంటలకు 61% పైగా పోలింగ్ నమోదు

Share with

13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 18వ లోక్‌సభ ఎన్నికల రెండో దశలో 88 నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. 1,200 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం, సగటు ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 61% నమోదయ్యింది. కేరళలో 20, కర్ణాటకలో 14, రాజస్థాన్‌లో 13, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలో 8, మధ్యప్రదేశ్‌లో 7, అసోం, బీహార్‌లో ఐదు, బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌లో మూడింటికి రెండో దశ పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్, మణిపూర్, త్రిపురలో ఒక్కొ స్థానంలో ఎన్నిక జరుగుతోంది.

రెండో విడత ఎన్నికల్లో కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, బీజేపీకి చెందిన తేజస్వీ సూర్య, హేమమాలిని, అరుణ్‌ గోవిల్‌, కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, శశిథరూర్‌, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేష్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పోటీలో ఉన్నారు. 2019లో 89 స్థానాలకు గాను ఎన్‌డిఎ 56, యుపిఎ 24 స్థానాలను గెలుచుకున్నాయి. ఏడు దశల్లో, 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు గత శుక్రవారం మొదటి దశ ఎన్నికలు జరిగాయి. పోలింగ్‌లో దాదాపు 65.5% ఓటింగ్ నమోదైంది.