Home Page SliderTelangana

హరి హర వీర మల్లు నుండి నేను తప్పుకుంటున్నా…!

Share with

ఓవైపు పవన్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తుంటే, మరోవైపు ఆయన సినిమాలకు సంబంధించి లెటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఆయన నటిస్తున్న సోషల్ ఫాంటసీ హరిహరమల్లు మూవీ విడుదలపై ఓవైపు చర్చ సాగుతుంటే, మరోవైపు ఆ చిత్ర డైరెక్టర్ క్రిష్ వార్తల్లో నిలిచారు. చాలా కాలం ఆలస్యం అయిన పవన్ కళ్యాణ్, హరి హర వీర మల్లు తిరిగి ట్రాక్‌లోకి వస్తున్నట్టుగా కన్పిస్తున్నప్పటికీ… మరోవైపు ఆ మూవీ నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడంతో అసలు సినిమా అప్పుడు మొదలవుతుందోనన్న టాక్ విన్పిస్తోంది. ఓవైపు నిర్మాతలు, టీజర్‌ను విడుదల చేయడంతో అభిమానులు సంబరాలు జరుపుకోగా, తాజాగా దర్శకుడు క్రిష్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో మూవీ విడుదల ఎప్పుడన్న చర్చ మొదలైంది. ఓవైపు పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీకి ఎన్నికల్లో పోటీ చేస్తోండటంతో ఆయన ఇకపై మూవీలో ఏ మేరకు చేస్తారో చూడాలి.

ఏఎమ్ రత్నం తనయుడు జ్యోతి కృష్ణ పెండింగ్‌లో ఉన్న షూటింగ్‌ను పూర్తి చేస్తారని, దానిని క్రిష్ పర్యవేక్షిస్తారని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. హరి హర వీర మల్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జ్యోతి కృష్ణ చూస్తారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటి భాగానికి హరి హర వీర మల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ అని పేరు పెట్టారు. రెండో విడతకు సంబంధించిన వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటిస్తారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాబీ డియోల్ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఏఎమ్ రత్నం నిర్మాత కాగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పూర్తయిన తర్వాత పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. త్వరలో OG, ఉస్తాద్ భగత్ సింగ్ షూట్‌ను కూడా తిరిగి ప్రారంభించనున్నాడు.