Home Page SliderNational

సంచలనాల యూట్యూబర్ ధృవ్ రాఠి భార్య పాకిస్థానీనేనా? ఇంతకీ ఆయనేమన్నారంటే!?

Share with

సోషల్ మీడియాలో ఎవరు ఎందుకు పాపులర్ అవుతారో ఊహించడం కష్టం. ప్రభుత్వం గురించి సంచలనాత్మక కథనాలు ప్రసారం చేసినా, గొప్పగా చెప్పినా వారు పాపులర్ అయ్యే అవకాశం ఉంది. దేశంలో సోషల్ మీడియా పెద్ద ఎత్తున దూసుకుపోతున్న తరుణంలో కొందరు రాత్రికి రాత్రే సెలబ్రెటీలు అవుతుంటారు. అలాంటి వారిలో హర్యానా యూట్యూబర్ ధ్రవ్ రాఠి ఒకరు. మొదట్లో ఆయన ఇచ్చిన రిపోర్టులకు పెద్దగా విమర్శలు వచ్చేవి కావు. అయితే తర్వాత తర్వాత ఆయన ప్రభుత్వంపై విమర్శలుగుప్పించడంతో ఆయనకు ఒక వర్గం ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అదే సమయంలో మరో వర్గం వ్యూయర్స్ ఆయనను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. దీంట్లో భాగంగా ఆయన ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంపైనా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి.

రాఠి “అసలు పేరు” బద్రుద్దీన్ రషీద్ లాహోరీ అని, భార్య జూలీ పాకిస్తాన్ జాతీయురాలు జులైఖా అని వైరల్ పోస్ట్‌లు పేర్కొన్నాయి. కరాచీలోని అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం బంగ్లాలో పాకిస్థాన్‌ మిలటరీ రక్షణలో దంపతులు నివసిస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ మొత్తం వ్యవవహారంపైనా, సోషల్ మీడియాలో తన భార్య గురించి చక్కర్లు కొడుతున్న వార్తలపై ధ్రువ్ రాఠి స్పందించాడు. 18 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్‌లను ఉన్న ధ్రువ్ రాఠి, దేశంలో అత్యంత పాపులర్ వ్యక్తుల్లో ఒకరయ్యారు. దీంతో ఆయనకు అనుకూల, వ్యతిరేక పోస్టులు కుప్పలుతెప్పలుగా సోషల్ మాధ్యమాల్లో షికార్లు చేస్తున్నాయి.

అయితే అందుకు ఆయన బదులిచ్చారు. “నేను తీసిన వీడియోలకు వారి వద్ద సమాధానం లేదు. కాబట్టి వారు ఈ ఫేక్ క్లెయిమ్‌లను ప్రచారం చేస్తున్నారు. నా భార్య, నా కుటుంబాన్ని ఇందులోకి లాగడానికి వారు సిగ్గుపడాలి? IT సెల్ ఉద్యోగుల అసహ్యకరమైన నైతిక ప్రమాణాలను దిగజార్చుతున్నారు.” అంటూ స్పందించాడు. ధ్రువ్ రాఠి యూట్యూబ్ ఛానెల్ ప్రభుత్వ విధానాలు, సామాజిక సమస్యలపై విమర్శలకు విస్తృత దృష్టిని ఆకర్షిస్తోంది.