Andhra PradeshHome Page Slider

సోషల్ మీడియా వేదికగా… అసెంబ్లీ ఘటనపై వైసీపీ, టీడీపీ దూషణపర్వం

ఏపీ అసెంబ్లీలో జరిగిన మొత్తం పరిణామాలపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడటంతో వైసీపీలో పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు టీడీపీ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. స్పీకర్ వద్ద నిరసన చెబుతుంటే తనపై ఎమ్మెల్యేలు సుధాకర్ బాబు, ఎలీజా దాడికి దిగారన్నారు బాల వీరాంజనేయులు స్వామి. ఐతే టీడీపీనే దాడి చేసినట్టుగా మీడియా ముందు చిత్రీకరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీడియోలను ఎడిట్ చేయకుండా విడుదల చేస్తే అసలేం జరిగిందన్నది తేలుతుందన్నారు. ఒకవేళ స్పీకర్ పై అనుచిత ప్రవర్తనకు దిగితే ఏ శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధమన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై వైసీపీ ట్వీట్‌పై టీడీపీ ఓ రేంజ్‌లో విరుచుకుపడింది. సిగ్గు శరం లేని పార్టీ మీది అంటూ రాసుకొచ్చింది.

అసెంబ్లీలో టీడీపీ కండకావరం అంటూ వైసీపీ ప్రచారం పర్వం అందుకొంది. చట్టసభల్లో దళితజాతిని టీడీపీ అవమానించిందంటూ ఎదురుదాడికిదిగింది.

తెలుగుదేశం ఎమ్మెల్యేలపై అసెంబ్లీలో దాడి చేయమని వైసీపీ సభ్యులను ప్రేరేపించిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి ఆదేశాలిచ్చింది ఎవరు? ఇంకెవరు?  ఎమ్మెల్సీ ఓటమితో తాడేపల్లి ప్యాలెస్ లో  రగిలిపోతున్న జగన్ రెడ్డి! అంటూ టీడీపీ ట్విట్టర్ ఎకౌంట్ నుంచి మరో ట్వీట్ పేలింది.

అసెంబ్లీ లో దళిత నేతలపై , టీడీపీ నేతలు దాడి చేశారని.. డిప్యూటీ సీఎం అని కూడా చూడకుండా తనను కొడకా అంటూ సంబోధించారన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

మొత్తంగా ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం.. 2024 అసెంబ్లీ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయన్నదానికి ట్రయలర్ వర్షన్ లా చూడాల్సి ఉంది.