Home Page SliderTelangana

“చినుకు పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నాం”..మంత్రి

Share with

జైలు నుండి వచ్చిన బిడ్డను ఆశీర్వదించడానికి ప్రతిపక్ష నేత కేసీఆర్ కు సమయం ఉంటుంది కానీ, వరద కష్టాల్లో ఉన్న ప్రజలను పరామర్శించడానికి గడప దాటడం లేదు అంటూ మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. చినుకు పడిన క్షణం నుంచి ప్రజల్లోనే ఉన్నాం. మాముందస్తు చర్యల వల్ల వీలైనంత ప్రాణ నష్టం తగ్గించగలిగాం. 2022లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వచ్చిన భారీ వర్షాలు, వరదలు నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి వర్షాలు క్లౌడ్-బరస్ట్, విదేశి కుట్ర అంటూ మతిలేని ప్రకటనలు చేసిన బీఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత లేదని ఎద్దేవా చేశారు.

పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలంలోని వరద ప్రాంతాలలో పర్యటిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ “వరదల్లో కారు కొట్టుకుపోయి చనిపోయిన సైంటిస్టు నునావత్ అశ్విని కుటుంబాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి క్యాబినెట్ సహచర మంత్రులం పరామర్శించి, భరోసా కల్పించాం. కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలన్న సోయి కూడా  బీఆర్ఎస్ పెద్దలకు లేకపోవడం దురదృష్టకరం. ఆయన కుమారుడు కేటీఆర్ అమెరికాలో ఉండి, ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా, అజ్ఞానంతో ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన ఎందుకు అమెరికా వదిలి రావడం లేదు ? అధికార పార్టీని తిట్టడమే ప్రతిపక్ష పార్టీ పని అన్నట్టుగా మా మీద దాడి చేస్తున్నారు. ఓటు వేసిన వేలుకు సిరా చుక్క కూడా తొలిగిపోయిందో లేదో అప్పటినుంచే దాడి మొదలుపెట్టారు. పది సంవత్సరాలలో విపత్తుల నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఒక్క నాడైనా ప్రకృతి విపత్తులమీద సమావేశం నిర్వహించారా ? దాన్ని బలోపేతం చేయాలన్న ఆలోచన చేశారా ? దాన్ని బలోపేతం చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? కొంతలో కొంతైనా ముప్పు తగ్గేది కదా” ! అంటూ విమర్శలు కురిపించారు.