డ్రగ్స్ టెస్టులకు మేమంతా రెడీ..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్టు చేయాలన్న ఎంపీ అనిల్ యాదవ్ చేసిన కామెంట్లకు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. మాదక ద్రవ్యాల పరీక్షకు తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ భవన్ లో మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నా ఫోన్ ను కూడా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చే స్తున్నాడు. 25 రోజుల కిందట ఒక ఫంక్షన్ కు వెళ్తే పోలీస్ లు వచ్చి నా వెహికిల్ చెక్ చేశారు. డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేస్తున్నడు’ అని కౌశిక్ రెడ్డి ఆరోపించారు.