Home Page SliderInternational

సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేత

బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అంతర్గత విభేదాల విషయంలో భారత ప్రభుత్వం జాగ్రత్తపడింది. ముందుజాగ్రత్తగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందితో సరిహద్దుల్లో పఠిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సరిహద్దుల్లో రాకపోకలు నిలిపివేశారు. యూకే శరణు కోరుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్ రక్షణలోనే ఉన్నారు. కాగా బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తగ్గాయి. మైనారిటీ వర్గాలను టార్గెట్ చేసి అల్లర్లు చేస్తున్నారు. ప్రధాని, చీఫ్ జస్టిస్ నివాసాలను లూటీ చేసిన ఆందోళనకారులు దొరికినవి దొరికినట్లు పట్టుకుపోతున్నారు. ఇప్పటి వరకూ 400 మంది చనిపోగా, నిన్న ఒక్కరోజే 135 మంది చనిపోయారు. అమెరికాలో ఉంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనా తనయుడు సాజీబ్ వాజెద్ జాయ్ ఆందోళన వ్యక్తం చేస్తూ తన తల్లి ఎలాంటి పరిస్థితులలో దేశాన్ని వీడాల్సి వచ్చిందో వివరించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నిక కాని పార్టీ అధికారంలోకి వస్తే దేశం ఎప్పటికీ కోలుకోలేదన్నారు. గత 15 ఏళ్లలో తన తల్లి  చేసిన అభివృద్ధి వృథా అవుతోందని పేర్కొన్నారు. తన ఒత్తిడి వల్లే ఆమె దేశాన్ని వీడాల్సి వచ్చిందని, దానికోసమే 15 ఏళ్లుగా పోరాడుతున్నారని ఆయన పేర్కొన్నారు. బంగ్లాను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ఆమె కలలు కన్నారని పేర్కొన్నారు.