ఏపీ ఐటీశాఖమంత్రిగా నారా లోకేష్
ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన వేళ..మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి ఏ శాఖలు కేటాయిస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించారు. దీనిలో మంత్రి నారా లోకేష్‌కు మానవ వనరులు, ఐటీ, RTG శాఖలను కేటాయించారు. అయితే గతంలో టీడీపీ హయాంలో కూడా నారా లోకేష్ ఐటీ శాఖమంత్రిగా సమర్థవంతంగా పనిచేసిన విషయం తెలిసిందే. కాగా ఆయన మంగళగిరి కేంద్రంగా ఐటీ అనుబంధ సంస్థలు,యువతకు నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా HCL వంటి దిగ్గజ ఐటీ కంపెనీని ఏపీకి తీసుకురావడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారు. అలాగే చంద్రబాబు మానస పుత్రికగా భావించే రియల్ టైమ్ గవర్నెన్స్ బాధ్యతలను కూడా మంత్రి నారా లోకేష్‌కు అప్పగించారు. కాాగా ఈసారి చంద్రబాబు కేబినెట్‌లో యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.

