Andhra PradeshHome Page Slider

ఏపీలో అనాథ పిల్లల కోసం “మిషన్ వాత్సల్య” పథకం

Share with

 తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన 18 ఏళ్ల లోపు అనాథలకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా తమకంటూ ఎవ్వరు లేని అభాగ్యులు ,అనాథల కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొత్త పథకానికి శ్రీకారం చుట్టాయి.  కాగా ఏపీలో “మిషన్ వాత్సల్య” పథకం ద్వారా అనాథ పిల్లలకు అండగా నిలిచేందుకు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన అనాథ పిల్లలకు ఇకపై నెలకు రూ.4వేల రూపాయల ఆర్థిక సాయం లభించనుంది. అయితే దీని కోసం పాఠశాల విద్యను అభ్యసిస్తున్న అనాథ పిల్లలు,నిరాశ్రయులు ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కాగా రాష్ట్రంలో అనాథల గుర్తింపులో టీచర్లు,గ్రామ/వార్డు సచివాలయ అధికారులు,అంగన్‌వాడీ సిబ్బంది,వాలంటీర్లు భాగస్వామ్యం కావాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ పిలుపునిచ్చింది.