Home Page SliderNational

భారత ప్రధాన కోచ్ పదవికి నో చెప్పిన రికీ పాంటింగ్

Share with

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ రికీ పాంటింగ్ త్వరలో ఖాళీ కానున్న భారత ప్రధాన కోచ్ పదవి కోసం తనను సంప్రదించినట్లు వెల్లడించాడు. అయితే ప్రస్తుతం “లైఫ్ స్టైల్”కి సరిపోకపోవడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించానన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ IPL ఫ్రాంచైజీకి ప్రధాన కోచ్‌గా ఇటీవల ఏడు సీజన్‌లను పూర్తి చేసిన పాంటింగ్, గతంలో ఆస్ట్రేలియా తాత్కాలిక T20 కోచ్‌గా ఉన్నారు. భారత్ స్థానం కోసం ఫీలర్లు బీసీసీఐ నుంచి వచ్చాయో లేదో చెప్పలేదు. “IPL సమయంలో చర్చలు జరిగాయన్నారు. అసలు చేస్తానా లేదా అనే దాని గురించి” అని పాంటింగ్ ICCకి చెప్పాడు. “జాతీయ జట్టుకు సీనియర్ కోచ్‌గా ఉండాలనుకుంటున్నా… జీవితంలో ఇతర విషయాలతో పాటు ఇంట్లో కొంచెం సమయం గడపాలి. అదే సమయంలో టీమిండియా కోచ్ గా వస్తే, ఆ తర్వాత ఐపీఎల్ జట్టుతో ఉండే అవకాశం ఉండదు. అదే సమయంలో టీమిండియాకు వర్క్ చేస్తే ఏడాదిలో 10, 11 నెలలలు కంటిన్యూగా టీమ్ కు అందుబాటులో ఉండాల్సి వస్తుంది ” అని పాంటింగ్ చెప్పారు.

బీసీసీఐ హెడ్ కోచ్ గురించిన ఆఫర్ తన కొడుక్కు చెప్పగా… వాడు ఎంతో ఉత్సాహం చూపాడన్నారు పాంటింగ్. “నా కుటుంబం, నా పిల్లలు గత ఐదు వారాలు ఐపిఎల్‌లో నాతో గడిపారు. వారు ప్రతి సంవత్సరం వస్తారు. దాని గురించి నా కొడుకుతో నేను గుసగుసలాడా” అని గుర్తు చేసుకున్నాడు. “నాన్నకు భారత కోచ్ ఉద్యోగం ఇస్తే మంచిది” అని కొడుకు చెప్పాడని పాంటింగ్ వెల్లడించాడు. “ఇది తీసుకోండి నాన్న, రాబోయే రెండు సంవత్సరాలు ఇండియాలో ఉండాం” అని కొడుకు తనతో అన్నట్టుగా పాంటింగ్ చమత్కరించాడు. “భారతదేశంలో క్రికెట్ సంస్కృతిని ఎంతగానో తన కుటుంబం ఇష్టపడతుందని, కానీ ప్రస్తుతం అది జీవనశైలికి సరిగ్గా సరిపోదు,” అన్నారాయన. చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ వంటి మరికొందరు హై-ప్రొఫైల్ పేర్లు కూడా రేసులో ఉన్నాయి. రాహుల్ ద్రవిడ్ భారత టీ20 వరల్డ్ తర్వాత ఖాళీ చేయనున్న స్థానానికి త్వరలో హెడ్ కోచ్ ఖరారు కానున్నారు. దరఖాస్తులు అందించేందుకు మే 27 చివరి తేదీగా బీసీసీఐ నిర్ణయించింది.