Home Page SliderTrending Today

రష్మిక, విజయ్ దేవరకొండలను వదలని రూమర్స్..రష్మిక క్యూట్ రిప్లై

Share with

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ జోడీగా నిలిచిన రష్మిక, విజయ్ దేవరకొండలపై రూమర్స్ కూడా అదే స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్‌’ చిత్రాలలో జంటగా నటించిన వీరిద్దరి కెమిస్ట్రీ బాగుందంటూ ప్రశంసలు లభించాయి. దీనితో వారిద్దరూ మంచి స్నేహితులుగా కూడా మారిపోయారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడం, కలిసి విదేశాలకు టూర్లు వెళ్లడం వంటి సంఘటనలతో వీరి జోడీపై రూమర్స్ ఎక్కువయ్యాయి. తాజాగా ఒక మీడియా సంస్థ రష్మిక, విజయ్ ఒకే గదిలో ఉన్నారని, వారిద్దరూ ఉన్న లొకేషన్ ఒకటేనని రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ఫోటోను, విజయ్ స్టిల్ ఫోటోను షేర్ చేస్తూ ఒకే ప్రదేశంలో ఉన్నారని పేర్కొంది. పైగా రష్మిక వేలికి ఉన్న ఉంగరం విజయ్‌కు ఎంతో ఇష్టమని, త్వరలోనే గుడ్‌న్యూస్ వింటామని జోస్యం చెప్పింది. ఈ పోస్టుకు స్పందించిన రష్మిక ‘అయ్యో.. అంతగా ఆలోచించకు బాబూ’ అంటూ స్మైలీని పోస్టు చేసింది. దీనితో వారిద్దరిదీ స్నేహమేనని మరే లేదని, మరోసారి చెప్పినట్టయ్యింది. ‘పుష్ప-2’, ‘రెయిన్‌బో’ చిత్రాలతో బిజీగా ఉంది రష్మిక. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘ఖుషి’ సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లారు విజయ్.