Home Page SliderTelangana

జైలు నుంచి విడుదలైన బండి సంజయ్

Share with

బీజేపీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. పదో తరగతి ప్రశ్నా పత్రాల లీక్ విషయంలో పోలీసులు బండిని అరెస్టు చేశారు. పరీక్ష పేపర్ల లీకేజీ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారించాలని సంజయ్ కేసీఆర్ సర్కారును డిమాండ్ చేశారు. దేశంలో హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా అంటూ ప్రశ్నించారు. తెలుగు పేపర్ ను ఎవరు లీక్ చేశారో మొత్తం విషయాలను బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎగ్జామ్ సెంటర్‌లోకి మొబైల్ ఎలా తీసుకెళ్లారు? ఎవరు తీసుకెళ్లారన్నదానిపై విచారణ జరపాలన్నారు. సీపీ ప్రమాణం చేసి.. తాను చెప్పిందంతా నిజమేనని చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ముందు బండి సంజయ్ 3 డిమాండ్లు పెట్టారు. పరీక్ష పేపర్ల లీకేజీ విషయాన్ని సిట్టింగ్ జడ్జితో విచారించడం, కేటీఆర్‌ను బర్తరఫ్ చేయడం, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌తో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల భృతి ఇవ్వాలని బండి ప్రభుత్వాన్ని కోరారు. వాట్సప్‌లో ఎవరో ప్రశ్నపత్రం పంపిస్తే అది కుట్ర ఎలా అవుతుందని సంజయ్ ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఇష్యూను డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. లీక్‌కు, మాల్ ప్రాక్టీస్‌కు కూడా తేడా సీపీకి తెలియదని సంజయ్ ఎద్దేవా చేశారు.