Home Page SliderInternational

“తెగిన తలను అతికించి అద్భుతం చేసిన డాక్టర్లు”

Share with

“వైద్యో నారాయణో హరి” అని చెప్పినట్లుగా వైద్యులు భగవంతుడితో సమానం అంటారు. అయితే దీనిని అక్షరాల నిజమని నిరూపించారు ఇజ్రాయెల్ డాక్టర్లు. ఇజ్రాయెల్ డాక్టర్లు ఓ అరుదైన సర్జరీ చేశారు. కారు ప్రమాదంలో తెగిపోయిన ఓ బాలుడి తలను డాక్టర్లు తిరిగి అతికించారు. అయితే గత కొన్ని రోజుల క్రితం సులేమాన్ హాసన్ అనే బాలుడు కారు ఢీకొనడంతో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆ బాలుడి తల దాదాపుగా మెడ నుంచి వేరు చేయబడిందని డాక్టర్లు తెలిపారు. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో కొన్ని గంటల పాటు శ్రమించి సర్జరీ చేశామని డాక్టర్లు వెల్లడించారు. ఈ సర్జరీ విజయవంతం అవడంతో ఆ బాలుడు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. అయితే గత నెలలో జరిగిన ఈ సర్జరీ గురించి డాక్టర్లు తాజాగా మీడియాకు వెల్లడించారు.