Andhra PradeshHome Page Slider

ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి

Share with

వైసీపీ మాచర్ల అభ్యర్థి పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనను అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ-వైసీపీ పరస్పర దాడుల తర్వాత పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ బూత్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసంపై ఆయన దోషిగా ఉన్నారు. టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసుకోవడం వల్లే ఇలా జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తోంది.