News AlertTelangana

దివాళి గుడ్‌న్యూస్ – దిగివచ్చిన బంగారం ధరలు

Share with

బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు గుడ్‌న్యూస్. దీపావళి సమీపిస్తుండడంతో బంగారం కొనుగోళ్లకు సాధారణంగా డిమాండ్ పెరుగుతుంది. దానితో పాటు ధర కూడా పెరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి బంగారం ధరలు పతనం అవుతున్నాయి. మామూలుగా శ్రావణ మాసం నుండి దీపావళి వరకూ బంగారం ధరలు పెరుగుతూ ఉంటాయి. కానీ రెండు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తూ ఏకంగా పది గ్రాములకు వెయ్యి రూపాయలు పైనే తగ్గిపోయింది.

స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై అక్టోబర్ 10 న 270 రూపాయలు, 11న 770 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10, 11 తారీఖులలో 250 రూపాయలు, 700 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్లు 10 గ్రాముల ధర  51,160 రూపాయలు. 22 క్యారెట్లు 10 గ్రాములు 46,900 రూపాయలు ఉంది. నెలల వారీగా చూస్తే ఈ సంవత్సరం మే నెల నుండి ప్రతీనెలా బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి.

బంగారం ధరలు మాత్రమే కాదు, వెండి ధరలు కూడా ఇలాగే పతనం అవుతున్నాయి. రెండురోజుల్లో కిలో వెండి ధర 2,000 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర 64,000 రూపాయలు. ఈ పతనం ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.