‘జగన్ వద్ద ఎలాంటి కోటరీలు లేవు’..కాకాణి
జగన్ వద్ద కోటరీలు ఉన్నారని, కల్లబొల్లి మాటలతో మీడియాను, ప్రజలను విజయసాయిరెడ్డి మభ్యపెడుతున్నారని వైసీపీ నేత మాజీ మంత్ర కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం సీఐడీ విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలపై, మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై పలు అభాండాలు వేశారని ఆరోపించారు. విజయసాయి వ్యాఖ్యలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమేనని పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ స్థానం కూటమికే దక్కుతుందనే ఇలా చేశారని, విజయసాయికి, రఘురామ కృష్ణంరాజుకి స్నేహం ఉందని, అందుకే ఇల్లు అద్దెకు ఇచ్చారని పేర్కొన్నారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన సాయిరెడ్డి ఎందుకు జగన్‌కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, చంద్రబాబుకు సాయం చేస్తూ గూడుపుఠాణి చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు.