BusinessHome Page SliderInternational

ప్రపంచంలోనే భారీ బంగారు గనులు

Share with

ప్రపంచంలోనే అతి పెద్దదైన బంగారు గనులు బయటపడ్డాయి. గతంలో ఏ ప్రాంతంలోనూ ఈ స్థాయిలో లేవని సమాచారం. చైనాలో  బంగారు గనులలో తవ్వకాలలో భారీ గనుల నిక్షేపం బయటపడింది.  ఈ గనులు సెంట్రల్ చైనాలోని హునాన్ ప్రావిన్స్ ఈశాన్య ప్రాంతంలో ఉన్న పింగ్జియాంగ్ కౌంటీలో కనిపెట్టారు.  సుమారు వెయ్యి మెట్రిక్ టన్నుల అత్యంత నాణ్యమైన బంగారం ఇక్కడ ఉన్నట్లు జియోలాజికల్ బ్యూరో ఆఫ్ హునాన్ ప్రావిన్స్ ధృవీకరించారు. దీని అంచనా విలువ ఏకంగా రూ. 7 లక్షల కోట్లు. చైనా కరెన్సీ ప్రకారం 600 బిలియన్ యువాన్లు. దీనితో ప్రపంచంలోనే ఈ మైన్ బంగారు నిక్షేపాలలో మొదటి స్థానంలో ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఈ మైనింగ్ చేయడంలో కార్మికులు తీవ్రంగా శ్రమించారు. 40 బంగారు సొరంగాలలో 3డీ టెక్నాలజీ ఉపయోగించి ఈ నిక్షేపాలను కనిపెట్టినట్లు చెప్తున్నారు.