BRS ఎమ్మెల్సీకి మరోసారి నోటీసులు
మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో కోడి పందాలు కలకలం రేగిన విషయం అందరికీ తెలిసిందే. క్యాసినో కేసులో BRS ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. గతంలో నోటీసులకు న్యాయవాది ద్వారా సమాధానం ఇచ్చిన పోచంపల్లిని వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో గెమింగ్ యాక్ట్.. యానిమల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో 62 మందిని అరెస్ట్ చేశారు.. 30 లక్షల నగదు.. 55 కార్లు, 86 పందెం కోళ్లు, బెట్టింగ్ కాయిన్స్ సీజ్ చేశారు పోలీసులు.