Breaking NewscrimeHome Page Slider

ఘ‌రానా దొంగ‌ల అరెస్ట్‌

Share with

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అటవీ శాఖ విశ్రాంత ఉద్యోగిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.46 లక్షలు దోచుకున్న ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.14 లక్షల విలువైన కారు, 4.5 తులాల బంగారం, 10 ప్రామిసరీ నోట్లను మిర్యాలగూడ ఠాణా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరుమలగిరి మండలం గట్టుమీద తండాకు చెందిన నిందితుడు ఆంగోత్‌ గణేశ్‌ గతంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్‌ వైర్లను చోరీ చేసేవాడు. అప్పనంగా వస్తున్న డబ్బులపై నిందితుడు గణేశ్‌ భార్య ప్రమీల ఆరా తీయడంతో భర్త బండారం బయటపడింది. మందలించాల్సింది పోయిన భార్య మరింత డబ్బు తీసుకోవాలని, తనకు బంగారు ఆభరణాలు చేయించాలని భర్తను ప్రోత్సహించింది. ప్రమీల సోదరుడైన కుర్ర శంకర్‌కు విషయం చెవిలో వేయడంతో తన బావ దగ్గర నుంచి వీడియోలు, ఫొటోలు తీసుకున్న అతను సదరు అధికారిని బెదిరిస్తూ రూ. 2.55 లక్షలు అన్యాయంగా వసూలు చేశాడు. నిందితులంతా బ్లాక్‌ మెయిల్‌ చేసి తీసుకున్న డబ్బులతో కారు, బంగారం, విలువైన ఫోన్లు కొనుక్కోని మొత్తంగా జల్సాలు చేశారు.దీంతో పోలీసులు ద‌ర్యాప్తు చేసి నిందితుల‌ను ప‌క్కా వ్యూహంతో ప‌ట్టుకున్నారు.